Sunday, March 15, 2026
Homeక్రైమ్తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల మనవడు దుర్మరణం చెందారు. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కనిష్క్ రెడ్డి వయలు 19 సంవత్సరాలు.

హైదరాబాద్ – ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడే కనిష్క్ రెడ్డి. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్ పై లారీని వెనక నుండి ఢీకొట్టింది తీగల మనవడి కారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో తీగల కృష్ణారెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. పలువురు రాజకీయ నేతలు తీగల నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments