Homeఆంధ్ర ప్రదేశ్అమ‌రావ‌తి రూప శిల్పి సీఎం చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు...! ప్ర‌ముఖుల విషెస్‌

అమ‌రావ‌తి రూప శిల్పి సీఎం చంద్ర‌బాబు జ‌న్మ‌దిన వేడుక‌లు…! ప్ర‌ముఖుల విషెస్‌

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళాన్ని అందజేశారు. అందుకు సంబంధించిన చెక్కును అన్న క్యాంటీన్ల సీఈఓకు సీఎం చంద్రబాబు సమక్షంలో నారా భువనేశ్వరి ఆదివారం అందజేసిన సంగతి తెలిసిందే.

ప్ర‌ముఖుల విషెష్‌…

భార‌త ప్ర‌దాని న‌రేంద్ర మోడీ చంద్ర‌బాబు నాయుడికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు నాయుడు ఆప్త‌మిత్రుడు మ‌రెన్నో ఇలాంటి జ‌న్మ‌దినాలు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం చంద్ర‌బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకత్వం, అపారమైన దూరదృష్టి సీఎం చంద్రబాబు ప్రత్యేకత అని ప్రశంసించారు. అభివృద్ధి పట్ల ఆత్మవిశ్వాసంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా భావించే నాయకుడు ఆయన అని అభివర్ణించారు.

అదే విధంగా నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ రథసారథి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్‌ సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. అదే విధంగా రాజకీయ క్షేత్రంలో అలుపెరుగని పోరాటయోధుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీబీఎన్.. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు అని అభివర్ణించారు. రాజకీయాల్లో అలుపెరగని యోధుడని పేర్కొన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి, ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడని ప్రశంసించారు. మంత్రి సత్య ప్రసాద్ ప్రియతమ నాయకుడు, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడుకి రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు