-
లోతైన దర్యాప్తు చేపడుతున్న పోలీసులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీని చుట్టూనే రాజకీయం నడుస్తోంది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ లొంగిపోవడంతో ఊహించని మలుపు తిరిగింది. పలు తీవ్రమైన ఆరోపణలతో పోలీసులు అతడిపై చాలా రకాల సెక్షన్లు పెట్టారు. ఇప్పుడు తాజాగా మరో కీలక సెక్షన్ జోడించడంతో.. ఈ కేసు మరింత జఠిలం అవుతోంది.
అత్యంత తీవ్రమైన నేరంగా…
బాధితురాలు వాంగ్మూలం ప్రకారం తాజాగా భగీరథ్ పై బి ఎన్ 64 (2)(m) సెక్షన్ జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఒక మహిళపై పదేపదే లైంగిక దాడి, అత్యాచారం చేసినట్లు నిరూపితమైతే అది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ నేరం కోర్టులో రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష తప్పదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు వరకు వెళ్లే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం వల్ల ఈ వ్యవహారానికి మరింత సునీతత్వాన్ని తీసుకొచ్చింది. బాధితురాలు మైనర్ అయి ఉండే అవకాశాల కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మకంగా పోలీసులు…
ప్రస్తుతం తెలంగాణలో హై ప్రొఫైల్ కేసుగా ఇది కొనసాగుతోంది. ప్రభుత్వంపై ఒకa రకమైన అనుమానపు చూపులు రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పోలీస్ శాఖ. ఇప్పటికే దర్యాప్తు బృందాలు బాధితురాలు స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఫోన్ డేటా, చాట్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. అవకాశం ఉంటే మరికొందరిని సైతం విచారణ చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ కేసు పై రాజకీయ నీడ పడడంతో రాష్ట్రవ్యాప్తంగా కేసులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో భగీరథ్ కు మద్దతుగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోలీసుల లోతైన దర్యాప్తులో మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. తాజాగా పోలీసులు జోడించిన సెక్షన్ నిరూపితమైతే కేంద్ర మంత్రి కుమారుడికి మరిన్ని ఇబ్బందులు తప్పవు.