•త్వరలో ప్రభుత్వం పడిపోతుందంటూ ప్రకటన
•ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ డీఎంకే శ్రేణులకు పిలుపు
•అంత వ్యూహమే అంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-తమిళనాడులో రాజకీయం మళ్లీ వేడెక్కింది. దళపతి విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. కనీసం కుదురుకోకముందే మాజీ సీఎం స్టాలిన్ సరికొత్త రాజకీయ మైండ్ గేమ్ కు తెర లేపారు. విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదని.. ఎంతో కాలం నిలవదని ఆయన వేసిన సెటైర్స్ ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో సెగలు రేపుతున్నాయి. ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు కాబట్టి.. డీఎంకే క్యాడర్ సిద్ధంగా ఉండాలని స్టాలిన్ ఇస్తున్న పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
సోషల్ మీడియా హైప్ తోనే…
ఎటువంటి భారీ అంచనాలు లేకుండా విజయ్ సాధించిన విజయం వెనుక డిజిటల్ మీడియా హైప్ తప్ప .. క్షేత్రస్థాయి కష్టం లేదని స్టాలిన్ విమర్శిస్తున్న తీరు ఇప్పుడు ఆలోచనలో పెడుతోంది. కనీసం బూత్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ఒక పార్టీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసునంటూ.. ఈ గెలుపు క్రెడిట్ మొత్తాన్ని కేవలం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా కే కట్టబెట్టారు స్టాలిన్. సోషల్ మీడియాలో పిల్లలను, వృద్ధులను వాడుకొని తాత్కాలికంగా సృష్టించిన ఈ ఇమేజ్.. త్వరలో పడిపోతుందని కూడా చెప్పుకొచ్చారు స్టాలిన్. పాలనలో లోపాలు బయటపడగానే జనం వాస్తవాలు గ్రహిస్తారని స్టాలిన్ తన కేడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
విజయ్ ప్రభుత్వాన్ని కాపాడుతూనే..
డీఎంకే అధినేత స్టాలిన్ ఒక వ్యూహం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. సర్వసాధారణంగా స్టాలిన్ ఓపెన్ కారు. తనకు అనుకూలమైన వాతావరణం ఉండే సమయంలో సైతమే ఆయన సంచలన ప్రకటనలు చేస్తారు. ఒకవేళ ఏదైనా ఊహించని రాజకీయ సంక్షోభం తలెత్తి.. విజయ్ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లితే తక్షణమే ఎన్నికలకు వెళ్లడం కంటే.. విజయ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే స్టాలిన్ మొగ్గు చూపుతారు. 2029 సార్వత్రిక ఎన్నికలు ఎలాగూ ఉన్నాయి. ఆ సమయం వరకు ఒక అస్తిత్వ వాతావరణాన్ని సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలన్నది స్టాలిన్ వ్యూహంగా అర్థం అవుతుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే స్టాలిన్ ఈ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించడం వెనుక పక్క వ్యూహం ఉంది. ఒకటి డీఎంకే శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు. రెండు రాజకీయంగా విజయ్ ను అస్థిరపరిచేందుకు. మరి స్టాలిన్ వ్యూహాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.