-
ఎవరికి వారే యమునా తీరుగా నాయకులు
-
క్రమేపి పట్టు కోల్పోతున్న రేవంత్
-
ఇలా అయితే కష్టమే
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ ఉన్నారు. అనూహ్య పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు. కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే సీనియర్లను కాదని.. దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన నేతలను కాదని హై కమాండ్ రేవంత్ కు అవకాశం ఇచ్చింది. కానీ గడిచిన రెండున్నర ఏళ్ల లో పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయారు రేవంత్. కానీ ఇప్పుడు క్రమేపి పట్టు సడలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తుమ్మితే ఊడిపోయే సర్కార్ అనేదాకా పరిస్థితి వచ్చింది.
ప్రారంభంలో దూకుడు…
Also Read:గురువాయూర్‌లో ఒక్కటైన ప్రేమ.. స్కాట్లాండ్ ఎంపీ, కేరళ మహిళ సంప్రదాయ వివాహం
ప్రారంభంలో దూకుడు కనబరిచారు సీఎం రేవంత్. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయంతో ఇక తిరుగు లేదని భావించారు. కానీ పార్టీకి, ప్రభుత్వానికి ఏకఛత్రాధిపతిగా వ్యవహరించాల్సిన రేవంత్ క్రమేపి పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. సొంత పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేల బహిరంగ అసమ్మతి ముందు నిస్సహాయంగా మారిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. క్రమశిక్షణ రాహిత్యంతో ఎవరికి వారు స్వతంత్ర ప్రకటనలు గుప్పిస్తున్నారు. వారిపై కనీస క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని బలహీన స్థితికి పార్టీ నాయకత్వం చేరుకుంది.
చిన్నారెడ్డి హెచ్చరిక…
Also Read:జానీ మాస్టర్‌కు మరోసారి షాక్.. నిషేధం కొనసాగింపుపై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేశారు జీవన్ రెడ్డి. ఆయనను పార్టీలో కొనసాగించే క్రమంలో నాయకత్వం సరిగా వ్యవహరించలేదన్న విమర్శ ఉంది. ఇప్పుడు ఆయన బాటలోనే మరో సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రయాణించే అవకాశం ఉంది. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయం పై మండిపడుతూ తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతానంటూ హై కమాండ్ కె హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చింది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులకు, ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తున్నారంటూ.. అవినీతిపై తిరుగుబాటు చేస్తానని బహిరంగంగానే సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం రెవిన్యూ శాఖలోని అక్రమాలు, సెటిల్మెంట్లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సమన్వయ లోపం…
Also Read:విజయ్–రష్మిక సరదా కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్!
ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో పాతతరం నాయకత్వానికి,, కొత్త తరం నాయకత్వం మధ్య సమన్వయం లేకుండా పోతోంది. పార్టీ మూల సిద్ధాంతాలను నమ్ముకుని దశాబ్దాలుగా సేవలందిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను విస్మరించి.. వలస నేతలకు,, ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెరుగుతోందని అభిప్రాయం వినిపిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో పాత, కొత్త నేత్తల మధ్య సమన్వయం కుదరడం లేదు. కనీసం స్వయోద్య కుదిరిచే పని చేయడం లేదు.. ఫిరాయింపు నేతల రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత ప్రభుత్వ స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గట్టిగా వ్యవహరించాల్సిన రేవంత్ చూసి చూడనట్టుగా వదిలేస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని రేవంత్ గుర్తించాలి. చెయ్యి దాటిపోతే ఆయన చేసేది ఏమీ ఉండదు కూడా
