Homeతెలంగాణకేంద్ర మంత్రులుగా ఈటెల,గోడం...!

కేంద్ర మంత్రులుగా ఈటెల,గోడం…!

  • తెలంగాణ నుంచి ఇద్దరికీ చోటు

  • బీసీ కోటాలో రాజేందర్, ఎస్టి కోటాలో నగేష్

  •  సామాజిక సమీకరణలను ప్రాధాన్యం ఇస్తూ ఎంపిక చేసిన బిజెపి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ప్రకటించడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈసారి ప్రాతినిధ్యం పెరగనుంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు ఛాన్స్ ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ తో పాటు గోడం నగేష్ పేర్లు ఖరారు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ బలంగా పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి, బీసీ వర్గాల నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా దృష్ట్యా ఈటెల రాజేందర్ ను తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం.

 రకరకాల సమీకరణలు…

Also Read:రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట.. లైంగిక వేధింపుల కేసు కొట్టివేత

వాస్తవానికి డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో అరుణ పేరు పక్కకు వెళ్లిపోయింది. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి ధర్మపురి అరవింద్ పేరును పరిశీలించిన హై కమాండ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఈటెల రాజేందర్.. ఎస్టి సామాజిక వర్గం నుంచి గోడం నగేష్ పేరు మిగిలినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ కేంద్ర మంత్రులుగా ఎంపిక కావడం ఖాయమని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

సుదీర్ఘ నేపథ్యం…

Also Read:22A భూముల వ్యవహారంపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు.. రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ

ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలకంగా పని చేశారు. కెసిఆర్ తరువాత నెంబర్ 2 గా కొనసాగారు. పలుమార్లు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. అయితే కెసిఆర్ కుటుంబ సభ్యుల రాకతో ఈటెల రాజేందర్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బిజెపిలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ ఉండడంతో ఆయనకు ఈటెల రాజేందర్ తోడైతే తెలంగాణలో పార్టీ బలోపేతం కావడం ఖాయం అన్న ఆలోచనలో హై కమాండ్ ఉంది.

ఏకైక ఆదివాసి ఎంపి…

Also Read:గురువాయూర్‌లో ఒక్కటైన ప్రేమ.. స్కాట్లాండ్ ఎంపీ, కేరళ మహిళ సంప్రదాయ వివాహం

బిజెపి నుంచి దక్షిణ భారతదేశంలో గెలిచిన ఏకైక ఆదివాసి గోడం నగేష్. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. పార్టీలో వివాదరహితుడిగా పేరు ఉంది. ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆదివాసి ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో బిజెపి బలాన్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈ నేతకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తే రాజకీయంగా భారీ మైలేజ్ లభిస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. చూడాలి బిజెపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు