HomeసినిమాSinger Sunitha: 'నా బాడీ.. నా హక్కు'పై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్, ఇంతకీ ఆమె...

Singer Sunitha: ‘నా బాడీ.. నా హక్కు’పై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్, ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

గాయని సునీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.  ‘నా బాడీ.. నా హక్కు’ అనే స్లోగన్ గురించి సునీత తప్పుబట్టారు. గత కొన్నేళ్లుగా ఈ నినాదం మహిళల స్వేచ్ఛకు ప్రతీకగా మారింది. తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ప్రతి మహిళకు ఉందని, తమ శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు తమదేనని పలువురు మహిళలు ఈ స్లోగన్ ద్వారా చెబుతున్నారు.

ఈ విషయంపై స్పందించిన సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించడం తప్పుకాదని ఆమె అన్నారు. అయితే, సమాజంలో ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, వ్యక్తిగత భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. “నీకు నచ్చిన దుస్తులు వేసుకో, నీకు సౌకర్యంగా అనిపించేలా ఉండు. కానీ, అదే అందరికీ సరైనదని చెప్పడం మాత్రం సరికాదు. మనం ఉన్న పరిస్థితులు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయో కూడా ఆలోచించాలి. పూర్తిగా సురక్షితంగా అనిపించే ప్రదేశాల్లో మనకు నచ్చినట్లు ఉండటం ప్రాక్టికల్‌గా సరైన నిర్ణయం” అని ఆమె అభిప్రాయపడ్డారు.

అలాగే, ఒకవైపు మహిళలు తమకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటే, మరోవైపు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు