Homeతెలంగాణశంషాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలి : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌

శంషాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలి : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌

గండిపేట,క్రైమ్ మిర్రర్:- శంషాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ కోరారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మను ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంషాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకోని అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పిహెచ్‌సి) 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీ పరిమిత సదుపాయాలతో ఉన్నందున స్థానిక ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, దీనిని మారుస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం చేరువ అవుతుందన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి దామోదర రాజనర్సింహ్మ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన నిధులు మంజూరు చేసేందుకు,న ఆసుపత్రి స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Social Connections: సోషల్ బాండింగ్‌తో జీవిత కాలం పెంచే రహస్యం!

Heroine Meera Chopra: డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు