క్రైమ్ మిర్రర్ : ఐటీ రాజధాని హైదరాబాద్‌లో మరో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో ఓ సెక్యూరిటీ గార్డు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించి కలకలం రేపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పరిధిలోని ఇందిరానగర్‌లో 24 ఏళ్ల యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. కాగా, ఆమె ప్రయాణ నిమిత్తం క్యాబ్ ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో సదరు మహిళ తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్‌కు గురైంది.
అయితే వెంటనే తేరుకున్న బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణంపై బాధితురాలు వెంటనే గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, నిందితుడిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
also read ; ఏపీలో కరువు కాటు…! చంద్రబాబు ప్రభుత్వానికి డబుల్ టెస్ట్…
also read ; ఏపీలో కరువు కాటు…! చంద్రబాబు ప్రభుత్వానికి డబుల్ టెస్ట్…
