Homeఅంతర్జాతీయంషార్జాలో భారతీయుడి దారుణ హత్య.. 9 ముక్కలుగా మృతదేహం..

షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. 9 ముక్కలుగా మృతదేహం..

క్రైమ్ మిర్రర్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకకు చెందిన ఓ భారతీయ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బ్యాగుల్లో దాచిన స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా ఉదయవార్‌కు చెందిన ఆల్విన్ ప్రకాష్ కుందర్ గత 14 ఏళ్లుగా యూఏఈలో నివాసముంటూ, షార్జా విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడితో పాటు భార్య టీనా కుందర్, వారి టీనేజ్ కుమారుడు కూడా షార్జాలోనే ఉంటున్నారు. కాగా, గత జూలై నెల నుంచి ప్రకాష్ కుటుంబం స్వదేశంలో ఉన్న బంధువులతో ఎలాంటి సంబంధాలు లేకుండా పోయింది.

జూలై 20న ఇండియా నుంచి ప్రకాష్ సోదరుడు అనిల్ పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. ఆ తర్వాత తాను బాగున్నట్లు ప్రకాష్ ఫోన్ నుంచి కేవలం మెసేజ్ మాత్రమే వచ్చింది. అనుమానం వచ్చిన అనిల్, షార్జాలోని తన స్నేహితుడు మనోహర్‌ను సంప్రదించి ప్రకాష్ నివాసానికి వెళ్లాల్సిందిగా కోరాడు. మనోహర్ అక్కడ విచారించగా, ప్రకాష్ కుటుంబం భారతదేశానికి వెళ్లిపోయిందని భవన నిఘా సిబ్బంది (వాచ్‌మెన్), ఆయన పనిచేసే ఆఫీసు ప్రతినిధులు తెలిపారు.

అయితే వారు ఇండియాకు రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మనోహర్ ద్వారా షార్జా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ప్రకాష్ నివాసంలోనే రెండు బ్యాగులలో తొమ్మిది ముక్కలుగా నరికి ఉన్న ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ దారుణం జరిగినప్పటి నుంచి ప్రకాష్ భార్య టీనా, కుమారుడు ఆచూకీ లేకుండా పోయారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యే ఈ హత్య చేసి, కుమారుడితో కలిసి ఇండియాకు పరారై ఉంటుందని ప్రకాష్ సోదరుడు అనిల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనిల్ కర్ణాటకలోని ఉడుపి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
also read : మహిళా టెక్కీతో సెక్యూరిటీ గార్డు అసభ్య ప్రవర్తన.. బలవంతంగా ముద్దుపెట్టి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు