Homeతెలంగాణరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మేడారం జాతర ఆహ్వానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మేడారం జాతర ఆహ్వానం

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: 2026 మేడారం మహా జాతరకు 2025 డిసెంబర్ 21న రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
అనంతరం మేడారం ఆచారాల ప్రకారం సమ్మక్క తల్లి చీర, కంకణం, కండువా మరియు ‘బంగారం’ (బెల్లం ప్రసాదం) రాష్ట్రపతికి సమర్పించారు. ఈ సందర్బంగా ఈ గిరిజన ఉత్సవ విశిష్టతను అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి, జాతరకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
జాతర తేదీలు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది.
జాతర షెడ్యూల్ (2026):
జనవరి 28: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు రాక.
జనవరి 29: చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దెపైకి రాక.
జనవరి 30: భక్తుల మొక్కులు, కానుకల సమర్పణ.
జనవరి 31: దేవతల వనప్రవేశం
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు