షిమ్లా, క్రైమ్‌మిర్రర్: అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ రూ. 500 పెట్టి రెండు టికెట్‌లు కొనగా అతనికి మొదటి బహుమతిగా రూ.3 కోట్లు లాఠరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
Also Read:వైసిపికి కాపు కాసేలా.. నేడు కాపు నేతల కీలక భేటీ.!
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్‌పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్‌లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. పంజాబ్ రాష్ట్ర డియర్ సమ్మర్ స్పెషల్ బంపర్ లాటరీలో తొలి బహుమతిగా రూ.3 కోట్లను గెలుచుకున్నారు.
Also Read:అయోధ్య విరాళాల వివాదంపై సిట్ నివేదిక.. యోగీ యాక్షన్ షూరూ.!
ప్రయాణికుడిని దింపేందుకు బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ అక్కడ రతన్ లాటరీ స్టాల్‌లో రూ.500 విలువైన రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. వాటిల్లో ఒకదానికి రూ.3 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతడి జీవితం మారిపోయింది. లాటరీ డబ్బుతో తన తండ్రి కలను నెరవేర్చుతానని కల్యాణ్ చంద్ తెలిపారు. తమ గ్రామమైన సథానాలో ఉన్న పాత రెండు గదుల అతిథి గృహాన్ని మళ్లీ నిర్మిస్తానని చెప్పారు. ముగ్గురు పిల్లల విద్య, భవిష్యత్తు కోసం మిగిలిన డబ్బును ఖర్చు చేస్తానని తెలిపారు.
Also Read:చర్చలు విఫలమైతే ఇక అంతే.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు స్ర్టాంగ్ వార్నింగ్