Homeఆంధ్ర ప్రదేశ్మూడేళ్ల ముందే హీటెక్కిన నెల్లూరు రాజ‌కీయం...!

మూడేళ్ల ముందే హీటెక్కిన నెల్లూరు రాజ‌కీయం…!

  • టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న మాటల యుద్దం...

 

నెల్లూరు, క్రైమ్ మిర్ర‌ర్‌: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలకు మూడేళ్లకు ముందే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. వేమిరెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద ప్లాన్ ఏంటి? కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతి రెడ్డిని ఎదుర్కొనేందుకు నల్లపురెడ్డి వద్ద ఉన్న వ్యూహాలేంటి? అన్న దానిపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే బలమైన నేతను ఎదుర్కొనాలంటే అంత ఆషామాషీ కాదు. జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తేనే తప్ప విజయం సాధ్యం కాదు. కానీ ప్రశాంతి రెడ్డి ఆ ఛాన్స్ ను నల్లపురెడ్డికి ఎంతమేరకు ఇస్తారన్నది ప్రశ్న.

Also Read:పెన్నులు కొంటున్నారా జాగ్రత్త.. బాంబులు ఉంటున్నాయన్న పోలీసులు

కోవూరు నియోజకవర్గ రాజకీయాల్లో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిల మధ్య తీవ్రమైన రాజకీయ మరియు విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రాజకీయ ఆధిపత్యం చుట్టూ తిరుగుతుంది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మరియు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యక్తిగత విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వీటిపై ప్రశాంతి రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో, మహిళల ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ రెడ్డిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఇటీవల వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది.

Also Read:Anchor Vishnu Priya: ఇప్పటి వరకు ఐదుగురితో ఆ పని చేశా.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపైనా, కూటమి ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. దీనికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మెరుపుతీగలా కోవూరుకు వచ్చి వెళ్లే నేత గురించి పట్టించుకోవాల్సిన పనిలేదని ప్రశాంతి రెడ్డి నల్లపురెడ్డి పై విరుచుకుపడ్డారు. కోవూరు నియోజకవర్గం ప్రజలు తెలివైన వారని, వచ్చే ఎన్నికల్లోనూ ప్రసన్న గెలవలేంటూ సవాల్ విసిరారు. అంతేకాదు కోవూరు నియోజకవర్గంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించడం వివాదం గా మారింది. మొత్తం మీద ఎన్నికలకు మూడేళ్ల ముందే కోవూరు రాజకీయాలతో సలసల మండుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు