HomeతెలంగాణVidya Varotsavalu: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు, కరపత్రం విడుదల చేసిన...

Vidya Varotsavalu: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు, కరపత్రం విడుదల చేసిన మేయర్ చైతన్య రెడ్డి

క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల కరపత్రం విడుదల కార్యక్రమం నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్  బుర్రి చైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, 47వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి అప్పగోని కవిత ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కళాశాల సిబ్బందితో కలిసి కలిసి వారు విద్యా వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

విద్యార్థినులలో నైపుణ్యాలను పెంపొందిచాలి!

ముఖ్య అతిథి మేయర్ బుర్రి చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యా వారోత్సవాలు కేవలం సభలు, ప్రసంగాలకే పరిమితం కాకుండా విద్యార్థినులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రేరణనిస్తాయని చెప్పారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని వివరించారు.

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రత్యేక అతిథి శ్రీమతి అప్పగోని కవిత మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. మహిళల ఉన్నత విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థినులు మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వ మహిళా కళాశాలను ఎంపిక చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసరాజు మాట్లాడుతూ, విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా వారోత్సవాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమం మొదటి రోజున కరపత్రం విడుదలతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందాలు విద్యార్థినులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెంచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ టి. శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన విద్యా వారోత్సవాలను తేదీల వారీగా విజయవంతంగా నిర్వహించాలని అధ్యాపకులను కోరారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి మంజుల, అధ్యాపకులు డాక్టర్ పుష్పలత, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ వసంత, డాక్టర్ ఎస్. రాజారామ్, రామ్ రెడ్డి, డాక్టర్ వెంకటకృష్ణ, డాక్టర్ నరేష్, మల్లికార్జున్, రాజు, శైలజ, సమత, మిస్కిన్, సరిత తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థినులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు