Homeక్రైమ్రేపే మున్సిపల్‌ ఎన్నికలు... బీజేపీ అభ్యర్థి సూసైడ్‌ కలకలం

రేపే మున్సిపల్‌ ఎన్నికలు… బీజేపీ అభ్యర్థి సూసైడ్‌ కలకలం

  • మక్తల్‌లో బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య

  • నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం

  • ప్రత్యర్థుల వేధింపులే కారణమని అనుమానం

మున్సిపల్‌ ఎన్నికల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. చందాపూర్‌ 6వ వార్డులో బీజేపీ తరపున పోటీకి నిలబడ్డ మహదేవప్ప (48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల వేధింపులు భరించలేకే తన భర్త సూసైడ్‌ చేసుకున్నాడని మహదేవప్ప భార్య సత్తమ్మ ఆరోపిస్తోంది. జైల్లో వేస్తామంటూ ఫోన్‌లో మెస్సేజులు పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు