Homeక్రీడలుస్టార్ ప్లేయర్లు ఉన్న గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ముంబై!

స్టార్ ప్లేయర్లు ఉన్న గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ముంబై!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ప్రతి ఏడాది ఐపీఎల్ చాలా అట్టహాసంగా జరుగుతోంది. ఐపీఎల్ అనగానే ప్రతి ఒక్కరికి మొదటిగా గుర్తుకు వచ్చేటువంటి ఫ్రాంచైజీలు ముంబై, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్. ఈ నాలుగు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫ్యాన్ బేస్ తో పాటు ఎన్నోసార్లు ట్రోఫీలను కూడా నెగ్గాయి. అయితే ముంబై జట్టు మాత్రం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్రతి మ్యాచ్ వరుసగా ఓడిపోతూ వస్తుంది. ప్రస్తుతం ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒకవైపు కెప్టెన్సీ లోను మరోవైపు బ్యాటింగ్ లోను తేలిపోతున్నారు. గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టుని అద్భుతంగా లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ అయిన తరువాత పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 2027 ఏడాది లో గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ నెగ్గింది. 2023లో మళ్లీ ఫైనల్ కు చేరి చివరి బంతికి ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత 2024 ఏడాదిలో ముంబై జట్టుకు కెప్టెన్గా వచ్చారు. కానీ ఆ ఏడాది మాత్రం పాయింట్స్ టేబుల్ లో ముంబై ఇండియన్స్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది జరిగిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్లేయర్ల నుంచి మంచి ప్రదర్శన రాలేకపోతుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ జట్టుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

కేటీఆర్ మౌనవ్రతం…! వ్యూహాత్మకమా? లేకుంటే అసంతృప్తా…?

సమంతకు సమ్మర్ కలిసొచ్చేనా..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు