హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: మాస్ మహారాజా రవితేజ మరోసారి సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న భక్తి-యాక్షన్ డ్రామా ఇరుముడి విడుదలకు సిద్ధమవుతుండగా, అదే సమయంలో మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. ఈసారి టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణుతో కలిసి నవ్వులు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ‘రాజా రాజ చోర’ ఫేమ్ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ఈ వినోదాత్మక చిత్రం తెరకెక్కనుంది. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:నిజామాబాద్‌లో దారుణం….! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య…!
ఇక మరోవైపు రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మిళితం చేశారు. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఇటీవల విడుదలైన ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు అనే భక్తి గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామి భక్తుల నుంచి ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, అనంతు గాత్రం కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి. మాస్ హీరో రవితేజను భక్తి ప్రధాన పాత్రలో చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
Also Read:లెనిన్’ చిత్రానికి ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్…!
ఒకవైపు ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన ఇరుముడి విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు హసిత్ గోలి-శ్రీవిష్ణుతో కొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. వరుస ప్రాజెక్ట్‌లతో రవితేజ తన స్పీడ్‌ను కొనసాగిస్తుండగా, వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మరోసారి మాస్ మహారాజా సందడి చేయనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.