Homeఆంధ్ర ప్రదేశ్ప్రహ్లాదపురంలో ఘోరం...వృద్దురాలిని చంపి బంగారం దోచుకెళ్లిన దుండ‌గులు...!

ప్రహ్లాదపురంలో ఘోరం…వృద్దురాలిని చంపి బంగారం దోచుకెళ్లిన దుండ‌గులు…!

పెందుర్తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: స్థానిక ప్రహ్లాదపురంలో అర్ధరాత్రి వేళ ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కర్రీ పైడమ్మ (72) అనే వృద్ధు రాలిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 112 ద్వారా పోలీసులకు సమా చారం అందించారు.

Also Read: ట్రెండ్ అవుతోన్న రకింగ్ వ్యాయమం…! అస‌లు ర‌కింగ్ వ్యాయ‌మం అంటే

దీంతో పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి అక్కడ లభించిన ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ను వేగవంతం చేశారు. ఈ ఘోర కలికలం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాం దోళనలను కలకలాన్ని రేపింది.

Also Read:క్యాతనపల్లిలో మంత్రి వివేక్‌ మార్నింగ్‌వాక్‌…!

తాజావార్తలు