
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ :- నూతన సంవత్సరం సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమండ్ల చెన్నయ్య మంత్రి వివేక్ వెంకట స్వామికి బొకే అందజేసి శాలువ కప్పి చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చెన్నయ్య నాకు చాలా ఏళ్లుగా తెలుసునని, మాల మహానాడు కోసం ఎన్నో పోరాటాలు చేశాడన్నారు. పీవీ రావు జీవించి ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ మళ్ళీ వర్గీకరణ కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం మాల ఉద్యోగులు, వివిధ మాల సంఘాల నాయకులు ఏక తాటి పైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తేనే మాలల హక్కులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు యూత్ ప్రెసిడెంట్ సుధాకర్, మాల మహానాడు సోషల్ మీడియా ఇంచార్జ్ గడమండ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Read also : వెంటనే ఆ రెండు పార్టీలు క్షమాపణలు చెప్పాలి : బండి సంజయ్
Read also : న్యూ ఇయర్ వేడుకలలో విషాదం.. మద్యం తాగి బిర్యానీ తినడంతో మృతి!





