క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తోందని, రాష్ట్రాన్ని ఇన్వెస్టర్లకు అసలైన స్వర్గధామంగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు తీవ్ర భయాందోళనలతో ఉండే పరిస్థితి ఉండేదని విమర్శించారు. ఆ సమయంలో “మీరు పరిశ్రమ పెడితే మాకేమి ఇస్తారు?” అని అడిగే ఒక విష సంస్కృతి కొనసాగిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే క్రమంలో “మీరు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఏమి ఇస్తారు? ప్రజలకు ఏమి చేస్తారు?” అని ప్రశ్నించే ఒక మంచి, పారదర్శకమైన సంప్రదాయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. పారిశ్రామిక అభివృద్ధికి మరియు కొత్త పెట్టుబడులకు ప్రభుత్వం వైపు నుండి పూర్తి ప్రోత్సాహం, రక్షణ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ ఓటమిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందేహాలు..!
