Homeక్రైమ్దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై భారీ ప్రమాదం..!

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై భారీ ప్రమాదం..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నేడు ఫిబ్రవరి 3, 2026 ఉదయం ఒక బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది.భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఇన్నాయి..

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో బైక్‌లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. వాహనదారుడు అప్రమత్తమై వెంటనే దానిని పక్కకు నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బైకు పూర్తిగా కాలిపోయి దగ్ధమైంది.

ఈ సంఘటన కారణంగా బ్రిడ్జిపై కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దింతో సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు