Facebook X WhatsApp Youtube
  • e-Paper
  •   తెలంగాణ
  •   ఆంధ్ర ప్రదేశ్
  •   క్రైమ్
  •   రాజకీయం
  •   జాతీయం
  •   అంతర్జాతీయం
  •   సినిమా
  •   ఇతరములు
    •   క్రీడలు
    •   వైరల్
    •   ట్రావెల్
    •   లైఫ్ స్టైల్
Search
Crime Mirror Latest Telugu Crime News & Breaking Updates
  • e-Paper
  •   తెలంగాణ
  •   ఆంధ్ర ప్రదేశ్
  •   క్రైమ్
  •   రాజకీయం
  •   జాతీయం
  •   అంతర్జాతీయం
  •   సినిమా
  •   ఇతరములు
    •   క్రీడలు
    •   వైరల్
    •   ట్రావెల్
    •   లైఫ్ స్టైల్
Home జాతీయం ఏడాది కష్టపడి తయారు చేసిన వివాహ ఆహ్వాన పత్రిక ఎలా ఉందో చూడండి.. 3 కిలోల...
  • జాతీయం
  • వైరల్

ఏడాది కష్టపడి తయారు చేసిన వివాహ ఆహ్వాన పత్రిక ఎలా ఉందో చూడండి.. 3 కిలోల వెండి, రూ.25లక్షల ఖర్చు! (VIDEO)

By
Shiva Krishna
-
January 24, 2026
0
408
Facebook
X
Pinterest
WhatsApp

    సాధారణంగా పెళ్లిళ్లకు కాగితపు ఆహ్వాన పత్రికలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ తండ్రి తన కుమార్తె వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకే సంప్రదాయానికి భిన్నంగా, ప్రపంచమే ఆశ్చర్యపోయేలా వెండితో తయారైన ఓ అద్భుత కళాఖండాన్ని పెళ్లి ఆహ్వాన పత్రికగా రూపొందించారు. జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రి తన కుమార్తె శ్రుతి జోహ్రి వివాహం కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ ప్రత్యేక శుభలేఖను తయారు చేయించారు. దీని విలువ దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ వెండి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

     

    View this post on Instagram

     

    A post shared by Jaipur Buzz (@jaipurbuzz)

    ఈ వెండి శుభలేఖను సాధారణ కార్డు రూపంలో కాకుండా, ఓ అందమైన బాక్స్ ఆకారంలో రూపొందించారు. దీని పొడవు సుమారు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు, లోతు 3 అంగుళాలుగా ఉంది. మొత్తం నిర్మాణం 128 ప్రత్యేకమైన వెండి ముక్కలతో తయారైంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక్క మేకు, ఒక్క స్క్రూ కూడా ఉపయోగించకుండా ఈ మొత్తం కళాఖండాన్ని సిద్ధం చేయడం. ప్రతి వెండి ముక్కను ఎంతో నైపుణ్యంతో ఒకదానితో ఒకటి అమర్చారు. ఈ అపురూపమైన డిజైన్‌ను పూర్తి చేయడానికి శివ్ జోహ్రికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టింది.

    ఈ వెండి వెడ్డింగ్ కార్డు పూర్తిగా హిందూ సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఇందులో మొత్తం 65 మంది దేవతామూర్తుల ప్రతిమలను అద్భుతమైన శిల్పకళతో చెక్కించారు. శుభలేఖ పైభాగంలో గణపతి విగ్రహం దర్శనమిస్తుండగా, ఆయనకు కుడివైపున పార్వతీ దేవి, ఎడమవైపున శివుడు కొలువై ఉన్నారు. వీరి కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకాదు, శ్రీకృష్ణుడి లీలలు, విష్ణువు దశావతారాలు, దక్షిణ భారత శైలిలో కృష్ణుడి రూపం, ఎనిమిది ఆవులతో కూడిన దృశ్యాలను కూడా ఇందులో చెక్కారు.

    బాక్స్ వెలుపలి భాగంలో అష్టలక్ష్ములు తమ పరివారంతో పాటు సూర్యభగవానుడితో దర్శనమిస్తారు. కార్డులో తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. వెనుక భాగంలో తిరుపతి వెంకన్న భారీ ప్రతిమ ఉండగా, పైభాగంలో సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు రూపొందించారు. కార్డు అంచుల వెంబడి ఏనుగులు, గుర్రాలు, నెమళ్లు వంటి జంతువుల బొమ్మలు, అలాగే 40 ఏనుగు ముఖాలను అద్భుతంగా చెక్కారు.

    ఈ వెండి శుభలేఖలో ద్వారపాలకులు, చామరాలు వీస్తున్న సేవకులు, శంఖం, డప్పులు వాయిస్తున్న దేవతామూర్తుల రూపాలు మరింత శోభను చేకూర్చాయి. రాముని దర్బార్, శివ కల్యాణం, తిరుపతి ఆలయ ద్వారాలు, రాధాకృష్ణుల లీలలు, శేషనాగుపై పవళించిన విష్ణుమూర్తి వంటి పౌరాణిక ఘట్టాలు ఈ కళాఖండాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

    ఈ దేవతామూర్తుల నడుమ వధువు శ్రుతి జోహ్రి, వరుడు హర్ష్ సోని పేర్లను అందంగా చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. కార్డు లోపల వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా శ్రద్ధగా చెక్కించారు.

    ఈ సందర్భంగా శివ్ జోహ్రి మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. నా కూతురి పెళ్లికి బంధువులను మాత్రమే కాదు.. సకల దేవతలను కూడా ఆహ్వానించాలన్నదే నా కోరిక అని చెప్పారు. ఆరు నెలల పాటు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నానని, నా బిడ్డకు తరతరాలు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలు చూసి గర్వపడేలా ఏదైనా ఇవ్వాలనుకున్నానని తెలిపారు. అందుకే స్వయంగా ఏడాది పాటు శ్రమించి ఈ వెండి శుభలేఖను తయారు చేశానని చెప్పారు. ఈ అపురూపమైన వెండి పెళ్లి పత్రికను లాంఛనంగా వరుడి కుటుంబానికి అందజేయనున్నారు.

    ALSO READ: Cosmic Smile: నిన్న రాత్రి ఆకాశంలో ఈ అద్భుతాన్ని చూశారా?

    • TAGS
    • Artistic wedding card
    • Creative invitation
    • Cultural creativity
    • cultural heritage
    • family emotions
    • Father love story
    • Handcrafted silver
    • Hindu wedding culture
    • Indian wedding traditions
    • Indian weddings
    • Jaipur wedding
    • Luxury Lifestyle
    • Luxury wedding
    • Pride of Jaipur
    • Rajasthan News
    • Silver art
    • Silver craftsmanship
    • Silver wedding card
    • Special wedding invite
    • Traditional art
    • Trending wedding story
    • Unique wedding invitation
    • Viral India news
    • viral social media news
    • Viral wedding card
    • Wedding creativity
    • Wedding innovation
    • Wedding inspiration
    • Wedding news India
    Facebook
    X
    Pinterest
    WhatsApp
      Previous articleజగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ముఖ్యమంత్రి కాలేరు : విజయ్ సాయి రెడ్డి
      Next articleవివాహేతర బంధం.. తమ్ముడితో కలిసి ఘోరానికి పాల్పడ్డ మహిళ
      Shiva Krishna
      Shiva Krishna
      http://www.crimemirror.com
      శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
      Facebook X Youtube

      EDITOR PICKS

      తల్లికి వందనం డబ్బుల వివాదం.. భార్యను హతమార్చిన భర్త

      July 24, 2026

      ఆస్తి కోసం కుట్ర.. మెట్‌పల్లి కాల్పుల కేసులో నలుగురు అరెస్ట్

      July 24, 2026

      భారీ పేలుడుతో దద్దరిల్లిన పాకిస్థాన్.. 15 మంది భద్రతా సిబ్బంది మృతి

      July 24, 2026

      POPULAR POSTS

      మునుగోడు ఆశ..రాజన్న శ్వాస..

      April 15, 2026

      Folk Star Nagadurga: జానపద గాయని నుంచి హీరోయిన్‌గా.. నాగదుర్గ కొత్త ప్రయాణం!

      June 20, 2026

      RGV: బలవంతుడిదే రాజ్యం.. గెలిచిన వారి మతంలో చేరుతా!

      March 4, 2026

      POPULAR CATEGORY

      • తెలంగాణ5800
      • జాతీయం2889
      • ఆంధ్ర ప్రదేశ్2216
      • క్రైమ్1853
      • రాజకీయం1791
      • వైరల్1726
      • సినిమా1003
      • అంతర్జాతీయం975

      ABOUT US

      Your trusted source for up-to-date crime news, in-depth investigative reporting, and comprehensive coverage of safety and legal issues affecting communities across India.

      Contact us: 📞 Phone: 093934 46188

      Trending Tags

      Crimemirror newsTrending news#TelanganaBreaking newsViral news

      Crime Mirror @ 2026. All Rights Reserved.

      • Contact
      • About
      • Privacy Policy