HomeజాతీయంLeave Story: లవర్‌తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే..?

Leave Story: లవర్‌తో గడపడానికి లీవ్ అడిగిన ఉద్యోగి.. మేనేజర్ ఏం చేశాడంటే..?

Leave Story: ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ సెలవులు అడగడం అనేది సహజమే. ఆరోగ్యం బాగోలేదని, కుటుంబ వేడుకలు ఉన్నాయని, ఊరికి వెళ్లాల్సి ఉందని, లేదా వ్యక్తిగత పనులున్నాయని చెప్పి లీవ్స్ తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలాసార్లు నిజమైన కారణం చెప్పకుండా చిన్న అబద్ధం చెప్పి అయినా సెలవు తీసుకునే పరిస్థితులు ఉద్యోగుల్లో కనిపిస్తుంటాయి. అయితే ఢిల్లీలోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసే యువ ఉద్యోగి మాత్రం అందరికీ భిన్నంగా ప్రవర్తించాడు.

తనకు సెలవు ఎందుకు కావాలో ఎలాంటి అబద్ధం లేకుండా, నేరుగా మేనేజర్‌కు మెయిల్ పంపాడు. తన ప్రేయసి ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోతుందని, ఆమెతో ఒక రోజు గడపాలని ఉందని స్పష్టంగా పేర్కొంటూ సెలవు కావాలని కోరాడు. ఈ మెయిల్ చదివిన మేనేజర్ మొదట కాస్త ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఇలాంటి కారణాలు ఎవరూ చెప్పరని, చాలా మంది అబద్ధాలు చెప్పి లీవ్స్ తీసుకుంటారని అతడికి తెలుసు.

అయితే ఆ ఉద్యోగి చూపిన నిజాయితీ మేనేజర్‌ను ఆకట్టుకుంది. ప్రేమ కోసం అయినా నిజం చెప్పి సెలవు అడగడం అరుదైన విషయమని భావించిన మేనేజర్.. ఎలాంటి సంకోచం లేకుండా లీవ్ మంజూరు చేశాడు. అంతేకాదు, ‘‘అబద్ధం చెప్పకుండా నిజం చెప్పావు కాబట్టి ఈ సెలవు నీకే’’ అంటూ సానుకూలంగా స్పందించాడు.

ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడితో ఆపకుండా, ఆ మేనేజర్ ఆ ఉద్యోగి పంపిన మెయిల్‌ను తన లింక్డ్ ఇన్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారింది. ఉద్యోగి నిజాయితీని, మేనేజర్ విశాల మనసును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో నిజాయితీకి కూడా విలువ ఉందని ఈ ఘటన నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి సంఘటనలు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, వర్క్ కల్చర్ మరింత ఆరోగ్యకరంగా మారుస్తాయి. పనితో పాటు వ్యక్తిగత జీవితానికీ గౌరవం ఇవ్వడం వల్లే మంచి ఫలితాలు వస్తాయని ఈ ఉదాహరణ చెప్పకనే చెబుతోంది.

ALSO READ: Crime: ఇంటి అద్దె అడిగినందుకు.. చంపి సూట్‌కేసులో పెట్టి..! (VIDEO)

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు