క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త సీఈవోగా ఇండియన్ అయిన కునాల్ షా నియమితులయ్యారు. ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. తాజాగా ఆయన నియమితులయ్యారు. 2019 నుంచి వాట్సాప్ సీఈవోగా వ్యవహరిస్తున్న విల్ కాథ్‌కార్ట్ స్థానంలో కునాల్ షా సారథ్యం వహించనున్నట్టు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కునాల్ షా క్రెడ్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఆ బాధ్యతలు నుంచి తప్పుకోనున్నారు. క్రెడ్ సీఈవోగా వ్యవహరిస్తున్న క్రునాల్ వాట్సాప్ సీఈవో బాధ్యతలను అప్పగించడమే కాకుండా మరో కీలక నిర్ణయాన్ని జుకర్ బర్గ్ తీసుకున్నారు. క్రెడ్‌లో రూ.8550 కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించారు. తాజా నిర్ణయం సంచలనంగా మారింది.
కోట్లాది మంది యూజర్లు క్రెడ్ సొంతం..
క్రెడ్‌ను కునాల్ షా 2018లో ప్రారంభించారు. దీన్ని ప్రధానంగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులు కోసం 2018లో ప్రారంభించారు. దేశంలో జరుగుతున్న క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లలో 40 శాతానికిపైగా క్రెడ్ వేదికగా జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో వినియోగదారులను పొందారో అర్థం చేసుకోవచ్చు. క్రెడ్‌కు ప్రస్తుతం 1.7 కోట్ల మంది నెలవారీ యూజర్లు ఉండగా, గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ గణనీయమైన స్థాయిలో వృద్ధి సాధించింది. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేసిన క్రునాల్ షా ఇకపై వాట్సాప్‌ను ముందుండి నడిపంచే బాధ్యతలను తీసుకోనున్నారు. ఈ సందర్భంగా క్రునాల్ వాట్సాప్ సీఈవోగా నియమించిన తరువాత జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కునాల్ క్రెడ్‌ను భారతదేశంలో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారన్న ఆయన.. ఇకపై ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడంలో ఆయనకు ఉన్న నిర్మాణ దృక్పథం, దృష్టి కోణం ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు, లక్షలాది మంది వ్యాపారవేత్తలకు అత్యుత్తమ సేవలు అందించే ప్రక్రియలో కునాల్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. ఇకపోతే, క్రెడ్ సీఈవో బాధ్యతలు నుంచి కునాల్ తప్పుకున్న నేపథ్యంలో.. కంపెనీ స్ర్టాటజీ, ఫైనాఽన్స్ బాధ్యతలను నిర్వహిస్తున్న మిథున్ సంపత్ తాత్కాళిక సీఈవోగా వ్యవహరించనున్నారు. ఇకపోతే, వాట్సాప్ సీఈవోగా నియమితులైన కునాల్‌కు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.