తెలంగాణ

మంత్రిపదవి కోసం బ్లాక్ మెయిల్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దారెటు!

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలనంగా మారాయి. తన ప్రకటనలతో కాక రేపుతున్నారు కోమటిరెడ్డి. మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తాను బీజేపీలోనే ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయేదని అన్నారు. తాను అనుకుంటే ఏడాదిన్నర కిందే మంత్రిని అయ్యేవాడనని చెప్పారు. తన వల్లే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందనే అర్ధం వచ్చేలా మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి.

మంత్రిపదవిపై కామెంట్ చేసిన మరోసటి రోజే మరింత దూకుడు పెంచారు. రేవంత్ సర్కార్ కొత్తగా అమలు చేస్తున్న నాలుగు పథకాలపై విసుర్లు వేశారు. రైతు బంధు ఒకసారి ఎగ్గొట్టామని బహిరంగ సభలోనే చెప్పారు.రైతుభరోసా 15వేలు అని 12 వేలు ఇవ్వడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపికే గందరగోళంగా ఉందన్నారు. గ్రామాల్లోని రైతులు, ప్రజలు కేసీఆర్ నే మెచ్చుకుంటున్నారని.. కాంగ్రెస్ ను తిడుతున్నరని ఓపెన్ గానే చెప్పేశారు. ఓ రకంగా రేవంత్ సర్కార్ పాలనా తీరు అధ్వాన్నంగా ఉందన్నట్లుగా మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న కామెంట్స్ తో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా ఉండడంతో ఆయన ఆలోచన ఏంటా అనే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తు చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీకీ , మళ్లీ తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరే సందర్భంలో అధిష్టానం నుంచి మంత్రి పదవిపై హామీ తీసుకున్నట్లు ఆయన అనచరులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ గా ఉండిపోయారు. లోక్ సభ ఎన్నికలు రావడంతో హై కమాండ్ కూడా మంత్రి పదవిపై సానుకూలంగా స్పందించినట్లు గాంధీ భవన్ లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ నెలలు గడుస్తుంది తప్పా విస్తరణ మాత్రం జరగడం లేదు దీంతో రాజగోపాల్ రెడ్డి అసహనం పెరిగిపోతుందని ఆయన అనచరులు చెబుతున్నారు.

అధిష్టానం చెప్పింది కాబట్టి చాలా రోజులు వేచి చూశాము. కానీ మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉంటున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెబుతున్నారు. తాను బీజేపీలో ఉండి ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కదూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉన్నట్లుండి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం ఏంటా అని హస్తం నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.రాజగోపాల్ రెడ్డి మళ్లీ తన పాత స్టైల్ లో రెచ్చిపోతున్నారంటూ పార్టీలో ప్రచారం జరగుతుంది.

ఐతే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై రకరకాల చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకపోవడంతో ఆయన ఇలా మాట్లాడుతున్నారని కొందరి విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. దీనికి తోడు మాజీ పిసిసి అధ్యక్షలు సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఆషామాషీ కాదంటున్నారు.అందునా ఒకే సామాజికవర్గం, ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే వ్యతిరేక సంకేతాలు వెళుతాయని అంటున్నారు. ఈ విషయం తెలిసే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

మరోవైపు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పుడు అధిష్టానం కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న పరమార్థం ఏంటి..? ఇప్పటికే పలుమార్లు పార్టీ మార్పుతో సంచలనాల సృష్టించిన రాజగోపాల్ రెడ్డి మరోసారి అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా అని చర్చ జరుగుతుంది. అందుకే బీజేపీ, కేసీఆర్ ప్రస్తావన తెస్తున్నారా ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button