-
జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల ఆదర్శంగా రాజకీయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కల్వకుంట్ల కవిత వ్యూహం ఏంటి? సొంత పార్టీతో విభేదించారు. సొంత వారిని వదులుకొని సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణకు తొలి మహిళా సీఎం కావాలన్నా లక్ష్యంతోనే ఆమె అడుగులు వేస్తున్నారు. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి బాటలోనే నడుస్తున్నారు. వారి మాదిరిగానే దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. ఆ ముగ్గురు మహిళా నేతలు తమ రాజకీయ ప్రారంభంలో అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు కవిత కూడా అనుసరిస్తున్నారు. వారి మాదిరిగానే రాజకీయాలు చేస్తున్నారు కవిత.
ఒక్కరే మహిళా ముఖ్యమంత్రి…
ప్రస్తుతం దేశంలో మహిళా ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు. బిజెపి తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్త ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 15 సంవత్సరాలు పాటు పశ్చిమ బెంగాల్ ను తన కను సన్నల్లో పాలించారు మమతా బెనర్జీ. ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తమిళనాడు ను ఏలిన జైలలిత మరణించి పదేళ్లు అయింది. ఉత్తరప్రదేశ్లో అధికారానికి మాయావతి దూరమై రెండు దశాబ్దాలు దాటుతోంది. ఇటువంటి సంక్లిష్ట సమయంలో కవిత తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలన్నా ఆశతో పని చేస్తున్నారు.
చాలా అరుదు…
ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మహిళలు ముఖ్యమంత్రి కావడం అంటే చాలా కష్టం. అత్యంత అరుదు కూడా. ఎన్నెన్నో పోరాటాలు చేసిన తరువాతనే జయలలిత, మమతా బెనర్జీలు ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టారు. ఆ స్థాయిలో పోరాటాలు చేయగల సత్తా ఉంటే తెలంగాణలో మహిళా సీఎంగా కవిత సాధించగలరు. అయితే ఎన్నో పోరాటాలు చేయాలి. ఇప్పటికీ కవిత కెసిఆర్ కుమార్తె గానే ప్రజలు భావిస్తున్నారు. ఆమె తనకంటూ ఒక సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ఆమె చాలా అడుగులు వేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆమె ఎంచుకునే మార్గం బట్టి ఆమె లక్ష్య సాధన ఉండనుంది.
చాలామంది ఫెయిల్…
ఉమ్మడి ఏపీలో నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి అభ్యర్థిగానే తన పోరాటం చేశారు. నందమూరి తారక రామారావు మృతి చెందిన తర్వాత సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత తన పార్టీని నిలబెట్టుకోలేక పోయారు. మరోవైపు తెలంగాణలో సినీ గ్లామర్ తో రాజకీయాల్లో అడుగుపెట్టారు రాములమ్మ విజయశాంతి. కానీ అనుకున్న స్థాయిలో పార్టీని నడపలేకపోయారు. పార్టీని బిజెపిలో విలీనం చేశారు. 2022లో తెలంగాణలో షర్మిల సైతం ఇదే మాదిరిగా పార్టీ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కానీ సక్సెస్ కాలేదు ఆ పార్టీ. దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇటువంటి చరిత్ర కలిగిన మహిళా రాజకీయాల్లో కవిత ఎంతవరకు రాణించగలరు అనేది చూడాలి.
ఇవి కూడ చదవండి:
-
నిమ్స్ లో అవినీతి డాక్టర్…! ఆదాయానికి మించిన ఆస్తులు…
-
ఓయో హోటల్లో యువతి మృతి కేసు.. విచారణలో సంచలన విషయాలు..
-
ఆస్తాకుంజ్ పార్క్లో బాలికపై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్
-
తెలంగాణలో దసరాకు కొత్త పింఛన్లు…! సీఎం ఆదేశం…
