ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. గత కొంతకాలంగా వరుసగా గాయాల బారిన పడుతుండటంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ, భవిష్యత్తులో కేవలం వివిధ ఫ్రాంచైజీ లీగ్స్‌లో మాత్రమే ఆడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇంగ్లండ్ తరఫున మార్క్ వుడ్ తన కెరీర్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆయన మొత్తం 146 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి, 253 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో తన మార్క్ చూపించిన ఆయన, 38 టెస్టుల్లోనే ఏకంగా 119 వికెట్లు సాధించారు. అంతేకాకుండా, ఇంగ్లండ్ చారిత్రాత్మక విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో యాషెస్ సిరీస్ గెలిచిన జట్టుతో పాటు, 2019 వన్డే వరల్డ్ కప్ మరియు 2022 టీ20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లండ్ జట్లలో మార్క్ వుడ్ కీలక సభ్యుడిగా కొనసాగారు. ఇంటర్నేషనల్ వేదికపై ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అభిమానులు కొనియాడుతున్నారు.
ఆ ముగ్గురు బాటలో కవిత…! పోరాడుతేనే లక్ష్య సాధన…
