Homeక్రైమ్ఓయో హోటల్‌లో యువతి మృతి కేసు.. విచారణలో సంచలన విషయాలు..

ఓయో హోటల్‌లో యువతి మృతి కేసు.. విచారణలో సంచలన విషయాలు..

క్రైమ్ మిర్రర్ : మాధాపూర్‌లోని ఓయో హోటల్‌లో షారన్ నిఖిత అనే యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసు విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల తనిఖీల్లో వెలుగుచూసిన ఆధారాలు
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు గదిలో విరిగిపోయిన బీర్, విస్కీ బాటిళ్లు కనిపించాయి. అంతేకాకుండా, గదిలోని బెడ్‌తో పాటు గోడలపై రక్తపు మరకలను అధికారులు గుర్తించారు. మృతురాలి ముఖం, శరీరం మరియు తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు ఉన్నట్లు పంచనామాలో తేలింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 1:48 గంటలకు నిఖిత హోటల్‌కు చేరుకోగా, కొద్దిసేపటి తర్వాత ఆమె ప్రియుడు శ్రీనివాస రవితేజ కూడా అక్కడికి వచ్చాడు.

అర్ధరాత్రి సమయంలో నిఖిత స్పృహ తప్పిపడిపోయిందంటూ రవితేజ తమ వద్దకు వచ్చాడని హోటల్ సూపర్‌వైజర్ పోలీసులకు వెల్లడించారు. ఆ సమయాన అంబులెన్స్‌ను పిలుద్దామని సూచించినప్పటికీ, రవితేజ నిరాకరించి తన బైక్‌పైనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆస్పత్రికి చేరేసరికే నిఖిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, అక్కడ నుంచి రవితేజ పరారయ్యాడు. మృతురాలు నిఖిత, ప్రియుడు రవితేజ కంటే మూడేళ్లు పెద్దదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రవితేజ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
also read : ఇంగ్లాండ్ స్టార్ ఫస్ట్ బౌలర్ రిటైర్మెంట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు