హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణలో మోడీ పర్యటనతో క మలం నేతలు జోష్ పెంచేశారు. అన్ని రాష్ర్టాల్లో కాషాయ జెండాను రెపరెపలాడించాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యం. దానికి అనుగునంగా తెలంగాణలో జెండా పాతేందుకు ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారు. పొత్తులతోనైనా, లేకుంటే ఒంటరిగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్తోంది. ఈ సూత్రంతోనే బెంగాల్‌లో చరిత్రను తిరగరాస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంది. ఇప్పుడు ఫోకస్ తెలంగాణపై పెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తత్యమని ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ సభలో మాట్లాడడం తెలంగాణ నేతల్లో జోష్‌ను పెంచేసింది.
అందుకు తగ్గట్టుగానే సభలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా మాట కలిపారు. తొలత ఎంపీ డీకే ఆరుణ మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. మళ్లీ మళ్లీ ప్రజలు సుపరిపాలన అందించడం వల్లే బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అనీ.. అందుకు తగ్గట్టుగా కార్యకర్తలు పని చేయాలనీ మోదీ పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేననటి స్పష్టం చేశారు.దేశ వ్యతిరేక శక్తులతో బీజేపీ పోరాడుతోందన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు. దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిలుగా విభజించే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమన్నారు. ఇక అధికారంలోకి వచ్చేముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పోరాడాలన్నారు.ఇక తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒక కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ నలిగిపోయిందన్నారు.
తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మోదీ ఇచ్చిన స్పూర్తితో ముందుకు సాగాలంటూ నేతలు కార్యకర్తలకు సూచించారు. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ అధికారం సాధించాలని సూచించారు.