Homeజాతీయంఆధార్ యూజర్లకు భారీ ఊరట.. ఈమెయిల్ అప్‌డేట్ ఇప్పుడు ఫ్రీ!

ఆధార్ యూజర్లకు భారీ ఊరట.. ఈమెయిల్ అప్‌డేట్ ఇప్పుడు ఫ్రీ!

ఆధార్ కార్డు ఉన్న కోట్లాది భారతీయులకు కీలకమైన శుభవార్త వెలువడింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా తీసుకున్న నిర్ణయంతో, ఆధార్ యూజర్లకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. జులై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే మొత్తం ఆరు నెలల పాటు, ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇప్పటివరకు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ మార్పు లేదా అప్‌డేట్ కోసం రూ.75 వరకు ఫీజు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు ఆ ఫీజును పూర్తిగా మాఫీ చేయడంతో యూజర్లకు ఇది పెద్ద ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా తరచుగా సర్వీసులు వినియోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

అయితే ఈ ఉచిత సదుపాయం అందరికీ ఒకే విధంగా వర్తించదు. కేవలం ఆధార్ అధికారిక యాప్ లేదా ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి మార్పులు చేయించుకునే వారికి సాధారణ చార్జీలు వర్తించే అవకాశముంది.

ప్రస్తుతం డిజిటల్ సేవలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆధార్‌కు ఈమెయిల్ ఐడీ లింక్ చేయడం చాలా ముఖ్యం. బ్యాంకింగ్, గవర్నమెంట్ స్కీమ్స్, OTP ఆధారిత సేవలు, KYC ప్రక్రియలు వంటి అనేక సేవలకు ఈమెయిల్ అవసరం అవుతోంది. అందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈమెయిల్ అప్డేట్ చేయడం ద్వారా యూజర్లకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆధార్ సంబంధిత నోటిఫికేషన్లు, సెక్యూరిటీ అలర్ట్స్, సర్వీస్ అప్‌డేట్స్ వంటి సమాచారం వెంటనే ఈమెయిల్ ద్వారా అందుతుంది. దీంతో మోసాల నుంచి కూడా కొంతవరకు రక్షణ పొందవచ్చు. ఇంకా, ఆధార్ డేటాను సకాలంలో అప్‌డేట్ చేయడం ప్రతి యూజర్ బాధ్యతగా భావించాలి. మొబైల్ నంబర్, చిరునామా, ఈమెయిల్ వంటి వివరాలు కచ్చితంగా సరిగ్గా ఉండటం వల్ల ప్రభుత్వ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా పొందవచ్చు.

also read: సమంత బేబీ బంప్ ఫోటో రివీల్- “నా సిక్స్ ప్యాక్” అంటూ క్యాప్షన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు