Homeసినిమాఆకాశంలోనే భారీ యాక్షన్ సీన్.. రాకా తో మరో లెవెల్‌కు వెళ్లనున్న అల్లు అర్జున్-అట్లీ సినిమా!

ఆకాశంలోనే భారీ యాక్షన్ సీన్.. రాకా తో మరో లెవెల్‌కు వెళ్లనున్న అల్లు అర్జున్-అట్లీ సినిమా!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాకా సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఆకాశంలో తెరకెక్కించే భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలవబోతుందట.హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విమానాలు, వైర్ యాక్షన్, భారీ వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ఈ సన్నివేశం భారతీయ సినిమాలోనే కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అంతర్జాతీయ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో అట్లీ తెరకెక్కించిన సినిమాల్లో ఎమోషన్స్‌తో పాటు భారీ మాస్ ఎలివేషన్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు రాకా కోసం మాత్రం ఆయన మరింత పెద్ద కాన్వాస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్ అంశాల మేళవింపుగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఇక అల్లు అర్జున్ లుక్ కూడా ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని టాక్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన రగ్గడ్ అవతారం అభిమానులను ఆకట్టుకుంది. పుష్ప తర్వాత మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు బన్నీ సిద్ధమవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమెపై కూడా భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు సమాచారం. కథలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.Sun Pictures నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు