Homeతెలంగాణఘోర రోడ్డు ప్ర‌మాదం...! ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురు మృతి...!

ఘోర రోడ్డు ప్ర‌మాదం…! ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురు మృతి…!

మెడ్చల్, క్రైమ్ మిర్ర‌ర్‌: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరపల్లి రాజీవ్ రహదారిపై అర్ధ రాత్రి జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి పరిశీలించారు.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో కరీంనగర్ కు చెందిన రైల్వే ఉద్యోగి చంద్ర శేఖర్ మరియు అతని భార్య రేఖ మరియు రేఖ చెల్లెలి కుమారుడు నిహాల్ 2 సంవత్సరాలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అర్థరాత్రి రెండు గంటల సమయంలో కారు అదుపు తప్పి అటుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.ఈ ప్రమాదానికి నిద్ర మత్తె కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామని ఏసీపీ మీడియాకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు