Homeఆంధ్ర ప్రదేశ్సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసుపై హోం మంత్రి మౌనం ....! స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌లు

సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసుపై హోం మంత్రి మౌనం ….! స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌లు

విజయవాడ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏపీ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత యమా యాక్టివ్‌గా ఉంటారు. పొలిటికల్‌ ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే అని సెటైరికల్‌గా మాట్లాడ్డం ఆమెతోనే మొదలైందని చెప్పుకుంటాయి రాజకీయవర్గాలు. అంతవరకు సరే.. రాజకీయ వ్యవహారాల్లో ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కానీ, మంత్రి హోదాలో ఉండి సంబంధింత శాఖ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా అనిత కేవలం పొలిటికల్‌ స్టేట్‌మెంట్స్‌కే పరిమితం అవుతున్నారా అన్నది చాలా మందికి వస్తున్న లేటెస్ట్‌ డౌట్‌. ఎందుకంటే.. రాష్ట్రాన్ని కుదిపేసిన సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసుపై హోం మినిస్టర్‌ సక్రమంగా స్పందించలేదన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఒకే ఒక్కసారి స్పందించారామె.

Also Read:SS Rajamouli: ప్రపంచ దిగ్గజాల సరసన చోటు.. జక్కన్నకు గ్లోబల్ గౌరవం!

అదీ కూడా కేవలం ఐదు సెకన్ల రియాక్షన్‌. సాధారణంగా పొలిటికల్ స్టేట్‌మెంట్స్‌ విషయంలో అనర్గళంగా మాట్లాడే అనిత అత్యంత కీలకమైన కేసు విషయంలో కేవలం ఐదు సెకన్లకే ఎందుకు పరిమితం అయ్యారన్నది బిగ్‌ క్వశ్చన్‌. రాష్ట్ర హోం మంత్రిగా అంత సీరియస్‌ సమస్య మీద సరిగా స్పందించకపోవడంపై వివిధ వర్గాల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.కస్టోడియల్‌ డెత్‌ కేసు విషయంలో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మంత్రే మాట్లాడ్డం లేదా? లేక స్పందించవద్దని ఆమెకు ఆదేశాలున్నాయా అన్న చర్చలు సైతం పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలు సైతం నిలదీస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన కేసు విషంలో హోం మంత్రి స్పందన అత్యంత పేలవంగా ఉండటం ఏంటి? హోం మంత్రి నోరు కట్టేస్తోంది ఎవరో తేల్చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.

Also Read:NEET UG Exam: ఒకే రోజు పరీక్షకు గుడ్‌ బై.. నీట్ పరీక్షలో భారీ మార్పులు!

ఈ కేసుకు సంబంధించి హోం మంత్రి రియాక్షన్‌పై రాజకీయవర్గాలతో పాటు సామాన్యుల్లో సైతం రకరకాల డౌట్స్‌ పెరుగుతున్నాయట.రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఒకరు హోం మినిస్టర్‌ మేకప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే.. అంతా ఖండించారు. అలాంటిది ఒక ప్రాణం విషయంలో ఆ స్థాయి స్పందన లేకపోవడం ఏంటన్న మాటలు వినిపిస్తున్నాయి. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే అనిత అలా వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు చాలామందిలో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత మంత్రికంటే ఎక్కువగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. అయినాసరే ఆమె నుంచి నో రియాక్షన్‌ అంటే… దీన్నెలా అర్ధం చేసుకోవాలంటూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ పెడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో చాలామంది ఇప్పుడు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కోట్ చేస్తున్నారట.

Also Read:Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!

నేనే హోమ్ మంత్రి అయి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని పవన్ వ్యాఖ్యానించడం..అనిత విషయంలో సరిగ్గా సరిపోతుందా అనే చర్చలు సైతం నడుస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌ ఏ ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారోగానీ.. వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. కొందరు.కారణం ఏదైనాసరే.. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే హోమ్ మంత్రి నోరు మెదపక పోవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు