క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వేరువేరు కుటుంబాలు ఉన్నాయి. కానీ అనుకోకుండా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు యథేచ్ఛగా సాగిన వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో పెద్దలు హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరిలోనూ మార్పు రాలేదు. యధావిధిగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో సదరు మహిళ వ్యవహార శైలిలో మార్పు రావడం, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రణాళిక ప్రకారం ఆమె గొంతును నలిమి చంపేశాడు. ప్లాన్ వర్కౌట్ అయిందని భావించి వెళ్లిపోయాడు. తీరా చూస్తే ఆమె ప్రాణాలతో బయటపడడమే కాకుండా ఆ వ్యక్తిని కటకటాల్లోకి వెళ్లేలా చూసింది. అసలు ఏమిటి కథ. ఎక్కడ జరిగింది అన్న విషయాలను చదివేయండి.
విశాఖలో జరిగిన ఘోర ఘటన..
విశాఖ నగర పరిధి కాపు లోప్పాడ హుడా లేఔట్ లో ఒక వివాహితపై కొయ్య కార్తీక్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగ మారిపేట రోడ్డులో బైక్ పై వెళుతున్న నిందితుడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతడు నుంచి జియో వైరు, మూడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. మధురవాడ స్వతంత్ర నగర్ కు చెందిన కార్తీక్, కొమ్మాది వైయస్సార్ కాలనీకి చెందిన వివాహేతతో 13 ఏళ్లుగా స్నేహం ఉంది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే వీరిద్దరికీ వేరువేరుగా వివాహాలు జరిగాయి. అయినప్పటికీ కలిసే తిరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఇరు కుటుంబాల పెద్దల మాటలను లెక్కచేయకుండా తిరుగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళలకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండడాన్ని కార్తీక్ సహించలేకపోయాడు. ఇదే విషయాన్ని పలుమార్లు సదరు మహిళలను హెచ్చరించాడు. అయినప్పటికీ మహిళలు మార్పు రాకపోవడంతో ఈ నెల 19న పథకం ప్రకారం బైక్పై కాపులుప్పాడ లే అవుట్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న కార్తీక్.. జియో వైరుతో ఆమె మెడను బిగించాడు. చనిపోయిందని భావించి ముళ్ళ వదల్లోకి తోసేసి కార్తీక్ పరారయ్యాడు. అయితే అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సదరు మహిళను వాకింగ్ కు వచ్చిన కొందరు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందించేలా చేయడంతో ప్రాణాలతో బయటపడింది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కార్తీకుని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.