Homeతెలంగాణరేవంత్ అమెరికా పర్యటనకు బ్రేక్...!

రేవంత్ అమెరికా పర్యటనకు బ్రేక్…!

  • రాజకీయ అనుమతులను నిరాకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ

  • యూకే వరకు ఓకే.. అగ్ర రాజ్యానికి నో పర్మిషన్

  • 23న తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ అనుమతి నిరాకరించింది. లండన్ పర్యటన ముగించుకుని నేరుగా అమెరికాలోని బోస్టన్, న్యూయార్క్ నగరాలకు వెళ్లాల్సిన సీఎం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆగస్టు 23న హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. హార్వర్డ్, ఎం ఐ టి, నార్త్ ఈస్టర్న్, వర్జిన్య టెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి సిద్ధమైన వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

యూకే నుంచి తిరిగి రాష్ట్రానికి…

Also Read: మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల హడావిడి….!

సుదీర్ఘ విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడిన సంగతి తెలిసిందే. యూకే లోని ఆక్స్ఫర్డ్, కేం బ్రిడ్జ్, ఎల్ ఎస్ ఈ వంటి విద్యాసంస్థల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. కానీ అమెరికా పర్యటనను మాత్రం అడ్డుకుంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న ప్రచారం నడుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ హోదాలో వెళ్తున్నప్పటికీ.. అక్కడ ఎన్నారై కాంగ్రెస్ వర్గాలు ఏర్పాటు చేసిన రాజకీయ, పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అని భావిస్తున్నారు. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం అధికారిక పర్యటనల పేరిట విదేశాలకు వెళ్లే ప్రజాప్రతినిధులు అక్కడి రాజకీయ సభల్లో విస్తృతంగా పాల్గొనడంపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది ఈ కోణంలోని అనుమతి తిరస్కరించి ఉండవచ్చున్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

రద్దు చేసుకున్న సీఎం…

Also Read:ఖాజాగూడ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ కమర్షియల్ నిర్మాణం..!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ నిబంధనలకు కట్టుబడి పర్యటనలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధాన లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణను, ప్రత్యేకించి హైదరాబాద్ గ్లోబల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకే తాను ఈ పర్యటన పెట్టుకున్నట్లు రేవంత్ చెబుతున్నారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని రేవంత్ స్పష్టం చేశారు. తాను వెళ్లకపోయినా.. అధికారిక బృందాన్ని అమెరికాకు పంపి ఆయా గ్లోబల్ యూనివర్సిటీలతో కుదుర్చుకోవాల్సిన ఒప్పందాలను, భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు