హైదరాబాద్, క్రైమ్మిర్రర్: ప్రపంచంలో నెలకొన్న పరిమాణాలతో బంగారం , వెండి ధరలు ఒడిదుడులకు లోనవుతున్నాయి. ప్రతి రోజు వీటి ధరలు మారుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే శుక్రవారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరల్లోనే కాదు.. కిలో వెండి ధరలో కూడా ఏ మాత్రం మార్పు లేదు. శుక్రవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,610గా ఉంది. కిలో వెండి రూ.2,90,100గా ఉంది.
ఇతర నగరాల్లోని వీటి ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,240గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,760గా ఉంది. కిలో వెండి ధర రూ.2,85,100గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,940గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,610గా ఉంది. కిలో వెండి ధర రూ.2,85,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,110గా ఉంది. కిలో వెండి ధర రూ.2,90,100గా ఉంది. కాగా బంగారు ధరలు మారుతుంటాయి కావున కొనుగోలు దారులు ధరలు తెలుసుకొని కొనుగలు చేయాలని గమనిక.