Homeఆంధ్ర ప్రదేశ్AP New CS: కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌, విజయానంద్ పదవీకాలం పొడిగింపు!

AP New CS: కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌, విజయానంద్ పదవీకాలం పొడిగింపు!

AP New Chief Secretary  G. Sai Prasad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించింది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జి.సాయిప్రసాద్‌ను సీఎస్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 1న ఆయన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకూ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పదవి బాధ్యతలు కొనసాగించనున్నారు.

ఎవరీ జి.సాయి ప్రసాద్‌?

1991 బ్యాచ్‌ కు చెందిన సాయి ప్రసాద్‌ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల సీఎం చంద్రబాబు నాయుడు  సీఎస్‌గా విజయానంద్‌ ను ఎంపిక చేశారు. తొమ్మిది నెలలుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30వ తేదీన విజయానంద్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, సీఎం చంద్రబాబు మరో మూడు నెలల పాటు విజయానంద్‌ ను సీఎస్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఆయన సర్వీసు మూడు నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం విజయానంద్‌కు మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. ఈ మేరకు మూడు నెలల పొడిగింపు ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అదే ఉత్తర్వుల్లోనే 2026 మార్చి 1 నుంచి సాయిప్రసాద్‌ సీఎస్‌గా కొనసాగుతారని సృష్టం చేసింది.

ప్రత్యేక సీఎస్ లుగా మరో ఇద్దరికి అవకాశం

అటు జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌లుగా ఆదిత్యనాథ్‌ దాస్‌, కేఎస్‌ జవహర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సాయిప్రసాద్‌ తాజాగా సీఎస్గా నియమితులయ్యారు. ఈ ముగ్గురు జలవనరుల శాఖకు పని చేసే వారే కావడం విశేషం.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు