Homeక్రైమ్ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు చంపేశాడు...!

ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు చంపేశాడు…!

  • ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు చంపేశాడు…!

  • ప్రాణాలు కోల్పోయిన తండ్రి, అక్క

Crime Mirror, Latest Updates: ఆన్లైన్ గేమ్స్ వ్యసనాల బారిన పడి చిన్నారులు దారుణాలకు తెగబడుతున్నారు. రోజు గంటల తరబడి ఆటలాడుతూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి వద్దను వారిస్తున్న కుటుంబ సభ్యులపై దాడులకు వెనుకాడడం లేదు. తాజాగా ఇలాగే ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన కుమారుడుని ఆటలాడవద్దు అంటూ హెచ్చరించిన కుటుంబ సభ్యులపై పదహారేళ్ల యువకుడు కత్తితో దాడులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో ఆ బాలుడు తండ్రి, అక్క మృతిచెందగా, తల్లి మృతువుతో పోరాడుతోంది. ఆ తర్వాత తను గొంతు కోసుకోవడంతో బాలుడు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. కర్ణాటకలోని కొప్పల జిల్లా గంగావతి తాలూకా అయోధ్య కాంపులో శనివారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగావతి సమీపంలోని అయోధ్య క్యాంపులో నివాసం ఉంటున్న వెంకట నాయుడు (45), సౌజన్య దంపతులకు కూతురు ప్రగతి (18), కుమారుడు వెంకట మణిదీప్ (16) ఉన్నారు. వెంకట నాయుడు తల్లిదండ్రులు కూడా వారితోనే ఉంటున్నారు. వీరి ఇంట్లో మూడు పడక గదులు ఉన్నాయి. శనివారం రాత్రి భోజనాలు అనంతరం నిద్రించేందుకు పడక గదుల్లోకి వెళ్లిపోయారు.

అయితే ఈ సమయంలో మొబైల్ లో ఆన్లైన్ గేమ్ కు బానిసైన మణిదీప్ ను అక్క ప్రగతి మందలించింది. అందరూ నిద్రపోయారు, పడుకోవాలంటూ సూచించింది. అయితే ఈ మాటలను సహించలేకపోయిన బాలుడు అక్కపై చేయి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మణిద్వీపను మందలించారు. మణిదీప్ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని పక్కన పడేశారు.

దీంతో మనది ఒక్కసారిగా ఇంట్లో పొలం పనులు చేసేందుకు ఉంచిన మత్తు కర్తను తీసుకువచ్చే ముందుగా అక్కను నరికాడు. ఆ తరువాత అడ్డువచ్చిన తల్లిదండ్రుల తలపై నరికాడు. చేతిలో అడ్డుపెట్టగా వాటిపైన నరికాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆహాకారాలు చేయడంతో పక్క రూమ్లో ఉండే వెంకట్ నాయుడు తల్లిదండ్రులు రాకుండా ఉండేలా గడియ పెట్టాడు.

ఆ తర్వాత తాను కూడా అదే కత్తితో గొంతు పోసుకుని పడిపోయాడు. గది తలుపులు బద్దలు కొట్టి వృద్ధులు బయటకు వచ్చి చూడగా అప్పటికే ప్రగతి కన్ను మూసింది. రక్తపు మడుగులో పడి ఉన్న వెంకట నాయుడు ను బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించుగా అక్కడ మరణించాడు. సౌజన్య, మణిదీప్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

ప్రాణాపాయ స్థితిలో బాలుడు, తల్లి..

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రగతి, వెంకట నాయుడు మృతిచెందగా.. బాలుడు, బాలుడు తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ దాడికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ వద్దన్నందుకే ఈ తరహా దాడికి పాల్పడ్డాడా.? లేక ఇంకేమైనా కారణాల ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ఈ ఘటన తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకొని విలపిస్తున్నారు. కొడుకు, మనవరాలని కోల్పోయిన ఆ వృద్ధులు తీవ్రంగా విలపిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇకపోతే తల్లి, బాలుడికి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు కూడా వీరికి సంబంధించిన ఆరోగ్య వివరాలను వెల్లడించారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బాలుడు తల్లి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం సృష్టించింది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసలుగా మారిన ఎంతోమంది ఈ తరహా దాడులకు పాల్పడడం, కొన్నిసార్లు హత్యలు చేయడం, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడం పరిపాటిగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు