హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: గతవారమంతా తగ్గిన బంగారం ధరలు ఈ వారం కూడ అదే పరిస్థితి కొనసాగుతుంది. కాగా భారత్‌లో మేలిమి బంగారం ధర సగటున రూ.1000 మేర తగ్గింది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690కు పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధరలో రూ.1,040ల మేర కోత పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి కూడా రూ.950ల మేర తగ్గి రూ.1,39,050కు చేరుకుంది. నగరంలో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి రూ.2.7 లక్షలుగా ఉంది. విజయవాడలో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,490గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,700గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,51,690ల వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల పసిడి రూ.1,39,050ల వద్ద ట్రేడవుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,51,840గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,200గా ఉంది. వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.6 లక్షల నుంచి రూ.2.7 లక్షల మధ్య కొనసాగుతోంది.