Homeజాతీయంఘోరంగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు?

ఘోరంగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఒకవైపు బంగారం మెల్లిగా తగ్గుతున్న వెండి మాత్రం మరింత వేగంగా తగ్గుతుండడంతో సామాన్య ప్రజలకు ఈ విషయం కాస్త ఊరట ఇస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అమాంతంగా పెరిగిన ధరలు ఒక్కసారిగా వారం రోజుల నుంచి కిందకు దిగి వస్తున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో కేవలం ఇవాళ ఒక్కరోజే వెండి ధర ఏకంగా 20 వేల రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 2,80,000 వద్దకు చేరుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెండి ధరలు ఏకంగా 40 వేల రూపాయలు తగ్గడంతో వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వ్యక్తులందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మరోవైపు బంగారం ధరలు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉన్నాయి.

10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 2000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,52,350 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారంపై 1900 రూపాయలతో 10 గ్రాములకు గాను ప్రస్తుతం లక్ష 39,650 ఉంది. ప్రపంచ మార్కెట్ లో వెండి ధరలు గణనీయంగా తగ్గడంతో స్థానిక మార్కెట్ పై ప్రభావం బాగా చూపుతుంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం మరియు వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

బాయ్ కాట్ వల్ల భారీ నష్టాలు.. జ్ఞానం లేని పాకిస్తాన్?

ఫిబ్రవరి 12 తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు