Homeక్రైమ్హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్‌.... డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్‌…. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతంలో ఒక పీజీ డాక్టర్ (జాన్ పాల్) తన అద్దె ఇంటిని డ్రగ్స్ విక్రయ కేంద్రంగా మార్చాడు. ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు దాడి చేసి, అతనిని అరెస్టు చేశారు.

అతని నివాసం నుండి ఓజి కుష్, MDMA, LSD స్టిక్స్, కొకైన్, హాష్ ఆయిల్ వంటి ఆరు రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.  ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రాకెట్‌లో భాగమైన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం: గచ్చిబౌలిలోని ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్స్/కో-లివింగ్ హాస్టల్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐటీ నిపుణులు, విద్యార్థులు ఉన్నారు. ప్రధాన నిందితుడు తేజ కృష్ణ బెంగళూరుకు చెందిన నైజీరియన్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు