క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్ :- ఉదయం ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల రోజంతా శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, యువకులు, వ్యాయామం చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పాల్లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే బరువు పెరగాలనుకునేవారికి కూడా ఉదయం పాలు మంచివి. అయితే కొందరికి ఖాళీ కడుపుతో పాలు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
రాత్రి పాలు తాగితే మంచి నిద్ర..!
రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. అలసట కూడా తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అవ్వడంలో పాలు సహాయపడతాయి. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉండేందుకు రాత్రి పాలు తాగడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
గోరువెచ్చని పాలు తాగితే డబుల్ బెనిఫిట్స్
ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని పాలు తాగడం శరీరానికి చాలా మంచిది. ఇలా తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంతేకాకుండా కండరాలు, కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కూడా గోరువెచ్చని పాలు ఉపయోగపడతాయి.
పాలు తాగేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు
పాలను చాలా చల్లగా తాగకపోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే పాలు తాగడం కూడా మంచిది కాదు. అలాగే అధికంగా పాలు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. లాక్టోస్ అసహనం ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే పాలు తాగాలి.
ఎప్పుడు తాగితే మంచిది..?
శరీరానికి శక్తి కావాలనుకునేవారు ఉదయం పాలు తాగవచ్చు. మంచి నిద్ర, ప్రశాంతత కోసం రాత్రి పాలు తాగడం ఉత్తమం. ఏ సమయమైనా గోరువెచ్చగా తాగితేనే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.