Homeఆంధ్ర ప్రదేశ్జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.. మరింత పెరిగిన ఎన్డీయే గ్రాఫ్: సీఎం చంద్రబాబు

జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.. మరింత పెరిగిన ఎన్డీయే గ్రాఫ్: సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, 2024 ఎన్నికల సమయంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే హవా మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనపై స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని పల్లెలు కన్నీళ్లు పెట్టే దుస్థితికి చేరాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన అనేక కీలక మార్పులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. పవన్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని ఆయన కితాబునిచ్చారు. పల్లెల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ క్రమంలోనే ‘పల్లె పండుగ’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ప్రజలు తమకు అండగా నిలిచేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

సీఈసీ కాదు.. నేరుగా ప్రధాని మోదీనే రాజీనామా చేయమనండి: సీజేపీకి కేజ్రీవాల్ సంచలన సూచన

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు