Homeక్రైమ్బ్రెడ్‌ ప్యాకెట్ లో చనిపోయిన బల్లి...! చిన్నారికి తప్పిన ముప్పు...

బ్రెడ్‌ ప్యాకెట్ లో చనిపోయిన బల్లి…! చిన్నారికి తప్పిన ముప్పు…

  • ఫుడ్ క్వాలిటీ పై మరో వివాదం

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: నార్సింగి పరిధిలోని జనవాడ గ్రామంలో ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతిరోజూ ఉపయోగించే బ్రెడ్ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా చిన్నారికి తినిపించే సమయంలో ఈ విషయం బయటపడడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టైంది. జనవాడలో నివసిస్తున్న అశోక్ అనే వ్యక్తి సమీపంలోని దుకాణం నుంచి బ్రెడ్ కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆయన భార్య ఆ బ్రెడ్‌ను పాలలో ముంచి తమ చిన్నారికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ సమయంలో బ్రెడ్ ముక్కలో అనుమానాస్పదంగా కనిపించిన భాగాన్ని గమనించి జాగ్రత్తగా పరిశీలించగా ముందుగా బల్లి తోక కనిపించింది. వెంటనే మొత్తం బ్రెడ్‌ను చెక్ చేయగా అందులో చనిపోయిన బల్లి ఉన్నట్లు గుర్తించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే దుకాణానికి వెళ్లి విషయాన్ని తెలియజేయగా, షాపు నిర్వాహకుడు దీనిపై డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే చిన్నారి ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులను సంప్రదించి విచారణ చేపట్టాలని, ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గ్రామస్థులు కూడా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు