Homeజాతీయందేశంలోనే సంపన్న సీఎం డీకే.. ఆయన ఆస్తులు విలువెంతో తెలుసా...!

దేశంలోనే సంపన్న సీఎం డీకే.. ఆయన ఆస్తులు విలువెంతో తెలుసా…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌ దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రలు జాబితాలో టాప్‌లో నిలిచారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా ఆయన నిలిచారు. ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాలడే రాష్ట్రాలకు చెందిన పది మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కంటే డీకే శివ కుమార్‌ ఆస్తే ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం డీకే శివ కుమార్‌ రూ.1,413 కోట్లు రూపాయల విలువైనాస్తులు ఉన్నాయి.

కాగా, అఫిడవిట్లలో పేర్కొన్న వవరాలు ప్రకారం డీకే శివ కుమార్‌ సంపన్న ముఖ్యమంత్రులు జాబితాలో టాప్‌లో నిలిచారు. డీకే శివ కుమార్‌ తరువాత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.931 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ జాబితాలో మూడో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నిలిచారు. ఆయన ఆస్తులు రూ.648 కోట్లు. దక్షిణాది ముఖ్యమంత్రులైన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రూ.30 కోట్లు, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ రూ.6.6 కోట్లతో తక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు.

పది మంది ముఖ్యమంత్రుల ఆస్తి రూ.106 కోట్లు…

అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఏడీఆర్‌) చేపట్టిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రకారం హిందీ మాట్లాడే రాష్ట్రాలైన బీహార్‌, చంఢీఘడ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖాండ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీలోని ముఖ్యమంత్రులు అందరి ఆస్తులు రూ.106.75 కోట్లుగా ఉన్నాయి. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులుఆస్తులు కంటే టాప్‌మూడులో నిలిచినముఖ్యమంత్రులు ఆస్తులు పది కొన్ని రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న డీకే శివ కుమార్‌ పది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే 13 రెట్లు సంపన్నుడుగా ఉండడం గమనార్హం.

డీకే శివ కుమార్‌, ఆయన సోదరుడికి ఖరీదైన భూములు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగుళూరు సౌత్‌ జిల్లాలోని కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే శివ కుమార్‌కు.. ఈ ప్రాతంలో రూ.10.37 కోట్ల విలువైన 71 ఎకరాల భూములు ఉన్నాయి. అలాగే, బెంగుళూరు రూల్‌ మాజీ ఎంపీ, డీకే సోదరుడు సురేష్‌కు 93.97 ఎకరాల వ్యవసాయ, ఇతర ఆస్తులు ఉన్నాయి. వాటి విలువను సమారు రూ.8.35 కోట్లుగా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏది ఏమైనా దేశంలోనే అత్యంత విలువైన ఆస్తులు కలిగిన సంపన్న ముఖ్యమంత్రిగా డీకే శివ కుమార్‌ నిలవడం గమనార్హం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు