నెల్లూరు, క్రైమ్‌మిర్రర్: కావలి నియోజకవర్గం దగదర్తి మం డలం సున్నపు బట్టి గ్రామం లో దారుణ ఘటన చోటుచేసుకుంది, అక్రమ సంబందాలు తో చెడు మార్గంలో నడుస్తున్న కోడలిని మందలించి సరైన్ మార్గం లో నడవాలని చెప్పిందన్న కారణంగా తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉందని భావించి అత్త మైపాటి మాధవిని పద్మ, ఆమె తల్లి పుచ్చలపల్లి మాధవి గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన కావాలి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
దగదర్తి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలును కావలి డీఎస్‌పీ రమణకుమార్ వెల్లడించారు. డీఎస్‌పీ మాట్లాడుతూ మైపాటి మాధవి అనే మహిళ తన కుమారుడికి సొంత అన్న కుమార్తె పద్మశ్రీ ని ఇచ్చి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు, పద్మశ్రీ భర్త నెల్లూరు లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండగా పద్మశ్రీ తల్లి బండి పై టిఫిన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని ఈ క్రమంలోనే పద్మశ్రీ అదే గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి అత్త మాధవి పద్మశ్రీ ని పలు మార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పడం,పెద్దల వద్ద పంచాయితీ పెట్టడం తో అత్త పై కక్ష పెంచుకుందని తెలిపారు.
తన అక్రమ సంబంధాలకు అడ్డుగా వున్న అత్తని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని తన అమ్మ పుచ్చలపల్లి మాధవి తో కలిసి పద్మశ్రీ లు కలిసి నిద్రిస్తున్న అత్త మైపాటి మాధవి గొంతునులిమి,దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్టు తెల్లవారి మాధవి వంటిపై గాయాలు గుర్తించిన బంధువులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులు భయంతో పారిపోయినట్టు పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచినట్టు డీఎస్‌పీ రమణకుమార్ తెలియచేశారు..