Homeజాతీయంప్రముఖ నగరాలలోని రెస్టారెంట్లలో కొత్తగా సిలిండర్ చార్జీలు!

ప్రముఖ నగరాలలోని రెస్టారెంట్లలో కొత్తగా సిలిండర్ చార్జీలు!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద పడినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా భారత దేశంలోని పలు ముఖ్య నగరాలలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడడం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం బెంగుళూరు మరియు చెన్నై వంటి పలు ముఖ్య నగరాలలోని పలు రెస్టారెంట్లలో బిల్లులలో “ఎల్పీజీ సర్ చార్జ్” కలిపి వేస్తున్నారు. గ్యాస్ కొరతతో ఉన్న నిలవలని ఎక్కువగా వాడుకోవాల్సి రావడం అలాగే ధరలు పెరగడంతో రెస్టారెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం పెద్ద రెస్టారెంట్లలో 10 నుంచి 30 రూపాయల వరకు ఈ ఎల్పీజీ సర్ చార్జ్ కింద వసూలు చేస్తున్నారని ఆ బిల్ చార్జీలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాదులో కూడా పలు హోటల్లలో టిఫిన్ రేట్లు భారీగా పెరిగిపోయాయి. సాధారణంగా మొన్నటి వరకు మసాలా దోశ 30 నుంచి 40 రూపాయలు ఉండగా ఈరోజు ఆ ధరలను ఏకంగా 60 రూపాయలకు పెంచేశారు. దీంతో సామాన్యులు సైతం ఈ ఛార్జీలను పెంచడంతో బయట టిఫిన్లు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు.

దిగొచ్చిన‌ బంగారం ధరలు

బస్త‌ర్‌లో మ‌ళ్లీ పేలిన తూటా…!మావోయిస్టుల‌కు ఎదురు దెబ్బ‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు