అమరావతి, క్రైమ్‌మిర్రర్: చాలా రోజుల తరువాత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పవన్‌కళ్యాన్ చేరుకోగాగానే సీఎం, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ముగ్గురు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ స్థానిక ఎన్నికల పై చర్చిస్తున్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పక్షాల మధ్య సమన్వయం, కలిసి పోటీ చేయడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. పర్సంటేజ్‌లతో సంబంధం లేకుండా పొత్తులతో ఎవరికి బలమున్న ప్రాంతాలలో వారు పోటీ చేయాలని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఏ ఒక్క స్థానం కూడ వైసీపికి దక్కకుండా చేయాలని నిర్ణయించారు.
