Homeఆంధ్ర ప్రదేశ్రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు...!

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు…!

అమరావతి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు.

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 11వ తేదీ గురువారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సీఎం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 9.00 గంటలకు అమరావతి చేరుకుంటారు.

తాజావార్తలు