Homeఆంధ్ర ప్రదేశ్రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో చోరీ

రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో చోరీ

  • 21తులా బంగారం, న‌గ‌దు అప‌హ‌ర‌ణ‌

మధురవాడ, క్రైమ్ మిర్ర‌ర్ః తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన పీ.ఎం.పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో క‌ల‌క‌లం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ శివశక్తినగర్ రోడ్డు వివేకానంద కాలనీలో నివసిస్తున్న విశ్రాంత లైన్‌మెన్ బొడ్డేటి అప్పలరాజు ఈనెల 2వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు. శనివారం14న ఉదయం యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు.

ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన సుమారు 21 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పీ.ఎం.పాలెం క్రైమ్ సీఐ బి.ఎస్.ఎస్. ప్రకాష్ పర్యవేక్షణలో ఎస్ఐ సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామ‌ని తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు